Mobile Popup Ad
Mobile Popup Ad

మహిళా బిల్లును వ్యతిరేకిస్తే పుట్టగతులు ఉండవు: మోదీ

కలం, వెబ్ డెస్క్: మహిళా బిల్లు (Women Bill)కు అన్ని రాజకీయపార్టీలు బేషరతుగా మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ బిల్లును వ్యతిరేకించే పార్టీలకు పుట్టగతులు ఉండవని వ్యాఖ్యానించారు. గురువారం ప్రధాని పార్లమెంటులో మాట్లాడుతూ.. మహిళా బిల్లును సాంకేతిక కారణాలు చూపించి కొన్ని పార్టీలు వ్యతిరేకించడం సరికాదన్నారు. ఈ బిల్లు ఎవరిపట్ల వివక్ష చూపించదని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఈ బిల్లును పెండింగ్‌లో పెట్టుకొని పాపం మూటగట్టుకున్నారని.. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకొందామని మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. మహిళలకు రాజ్యాధికారం ఉండొద్దా? అంటూ ప్రధాని ప్రశ్నించారు. పంచాయతీల్లో రిజర్వేషన్లు ఉన్నప్పుడు పార్లమెంటులో ఎందుకు ఉండొద్దని వ్యాఖ్యానించారు. ఉత్తరాది, దక్షిణాది, పశ్చిమం, ఈశాన్యం ఏ ప్రాంతం మీద తమకు వివక్ష లేదని స్పష్టం చేశారు. పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో కీలక ఘట్టమని అభివర్ణించారు. దేశానికి సరికొత్త దిశను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

మహిళలు దేశానికి కొత్త దిశ చూపిస్తారు

మహిళల చేతికి అధికారం అప్పగిస్తే దేశానికి కొత్త దిశ ఇస్తారని వ్యాఖ్యానించారు. బిల్లుకు మద్దతిచ్చే పార్టీలకే రాజకీయ మనుగడ ఉంటుందని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలు ఈ బిల్లుకు (Women Bill) ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి ప్రధానిని అయ్యాయనని.. ఈ బిల్లు ప్రవేశపెట్టడం తనకు ఓ పెద్ద బాధ్యత అని అభివర్ణించారు. మహిళల కోటా విషయంలో రాజకీయం చేయొద్దని కోరారు. ఈ బిల్లు కోసం మహిళలు 30 ఏండ్లుగా పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రంపైనా కేంద్ర ప్రభుత్వానికి వివక్ష లేదని స్పష్టం చేశారు. మహిళలకు హక్కులు ఇవ్వడం మన బాధ్యత అని దీన్ని గొప్ప కార్యంగా అహంకారంగా ప్రకటించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇదోదే గొప్ప విషయమని అహంకారం చూపించొద్దు. మహిళా బిల్లుకు సంబంధించిన క్రెడిట్ అన్ని పార్టీలకు దక్కుతుందని.. ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదని మోదీ పేర్కొన్నారు.

Read Also: తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి: పొన్నం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>