కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్విభజనకు (Delimitation) ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మద్ధతివ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ (Manickam Tagore) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలకంటే అధికారానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారని పదే పదే నిరూపిస్తున్నారని ఫైర్ అయ్యారు.
కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆర్థిక భవిష్యత్ కు పెను ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. అయినప్పటికీ మోదీతో కలిసి దక్షిణాది గొంతును బలహీనపరిచే డీలిమిటేషన్ కు చంద్రబాబు (Chandrababu) మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. సొంత మామకు ద్రోహం చేయగల వ్యక్తి, ఇప్పుడు తన రాజకీయ మనుగడ కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను అంధకారంలోకి నెడుతున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్ ను ఎదిరించడానికి బదులుగా అన్యాయానికి మద్దతు ఇస్తున్నాడని అన్నారు. ఇది పథకం ప్రకారం లొంగిపోవడం.. ప్రజలకు ద్రోహం చేయడమేనని అంటూ చంద్రబాబు తీరుపై మాణిక్యం ఠాకూర్ (Manickam Tagore) నిప్పులు చేరిగారు.
Read Also: మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు.. 10 పర్సెంట్ మినిస్టర్ ఎవరు?
Follow Us On: X(Twitter)

