ఛాత్రోంకి గూంజ్.. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని వీక్షించిన TPCC చీఫ్

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్‌లో (Nizamabad) యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఛాత్రోంకి గూంజ్” కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పుణేలో నిర్వహించిన “ఛాత్రోంకి గూంజ్” లైవ్ కార్యక్రమాన్ని మహేష్ కుమార్ గౌడ్ వీక్షించారు.

విద్యార్థులు, యువతకు సంబంధించిన అంశాలు, వారి సమస్యలు, భవిష్యత్ అవకాశాలపై నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ, స్టేట్ కార్పొరేషన్ ఛైర్మన్లు తాహెర్ బిన్ హమ్దాన్, శేఖర్ గౌడ్, పీపీ దయాకర్ గౌడ్, మనాల మోహన్ రెడ్డి,నరాల రత్నాకర్, మజీద్ ఖాన్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>