కలం, వనపర్తి: గ్రామాల్లోని వివిధ వర్గాల ప్రజలు, కుల సంఘాల నాయకులను కలుస్తూ బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ పిలుపునిచ్చారు. శనివారం వనపర్తి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా నూతన జిల్లా కమిటీని ప్రకటించారు. నూతన కమిటీ సభ్యులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ, జిల్లా కోర్ కమిటీ సభ్యులు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డి.నారాయణ, కొమ్ము శ్రీనివాసులు మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
గ్రామాల్లోని వివిధ వర్గాల ప్రజలు, కుల సంఘాల నాయకులను కలుస్తూ బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. ఓబీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ వర్గాల సంక్షేమానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని నాయకులు పేర్కొన్నారు. జాతీయ ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం, కేంద్ర మంత్రివర్గంలో ఓబీసీలకు ప్రాతినిధ్యం కల్పించడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు.
నూతన కమిటీ
ఉపాధ్యక్షులుగా పరమేశ్వర్, ఉండేకోటి అంజనేయులు, జె.పవన్, బోయ విష్ణు, మొదల వినోద్ సాగర్, ప్రధాన కార్యదర్శులుగా ఆర్.నరసింహులు నాయుడు, నాలవోతుల రవి, సిరియాల శ్రీనివాసులు, కార్యదర్శులుగా ధర్మన్న, రాంచందర్, మధు నాయుడు, వి.వెంకటేష్, కావలి శ్రీశైలం, కోశాధికారిగా చిలుక చెన్నయ్య సాగర్, జిల్లా అధికార ప్రతినిధిగా సురేష్ గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్‌గా మందీ రామకృష్ణ యాదవ్ నియమితులయ్యారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా చంద్రయ్య, ఎల్లస్వామి యాదవ్, కె.శ్రీశైలం యాదవ్, వెంకటేష్ యాదవ్, కె.మహేష్ గౌడ్, జానంపేట అంజనేయులు తదితరులకు బాధ్యతలు అప్పగించారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సబి రెడ్డి, వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.శ్రీశైలం, ఆర్.వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, ఉపాధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, కోశాధికారి బండారు కుమారస్వామి, అధికార ప్రతినిధి నక్క మహేష్, ఐటీ సెల్ కన్వీనర్ అంజి యాదవ్, యువమోర్చా అధ్యక్షుడు అరవింద్, పెబ్బేరు పట్టణ అధ్యక్షుడు క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

