భారత ప్రజాస్వామ్యంపై రాహుల్​ గాంధీ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​: ఎన్నికల అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ఎన్నికలను బహిష్కరించే అవకాశమే లేదని లోక్​ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన కొలంబియా విశ్వవిద్యాలయం(Columbia University)లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రజాస్వామ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో అవకతవకలు జరిగినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఎన్నికల ప్రక్రియను బహిరంగంగా ప్రశ్నించే ముందు “100, 200, 300 శాతం రుజువులు” ఉండాలని సీనియర్​ నాయకులు సలహా ఇచ్చారని గుర్తు చేశారు.

ఎన్నికలకు బహిష్కరించి దూరంగా ఉండడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని వదులుకోవడమేనని రాహుల్​ గాంధీ అభిప్రాయపడ్డారు. రాజకీయంగా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరిస్తూ, విమర్శలు ఎదుర్కొంటూనైనా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అయితే ఎన్నికల వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలన్నది తమ ఉద్దేశం కాదని రాహుల్ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు.

Also Read : ఎయిర్‌పోర్టులో కలకలం: టెర్మినల్‌లోకి చొరబాటుకు వ్యక్తి యత్నం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>