కలం, ఉట్నూర్: భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) అన్నారు. ఇందిరా గాంధీ జయంతి (Indira Gandhi Jayanthi) సందర్భంగా గురువారం ఉట్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఇందిరా గాంధీ చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఆమె ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తోందన్నారు. ఇందులో భాగంగా కుటుంబ పెద్దలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

