ఎయిర్‌పోర్టులో కలకలం: టెర్మినల్‌లోకి చొరబాటుకు వ్యక్తి యత్నం!

కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI Airport Delhi)లో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 18వ తేదీన విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఎలాంటి చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా బలవంతంగా టెర్మినల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడే విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతని కదలికలను గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. అతన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>