కలం, వెబ్‌డెస్క్: 15 ఏళ్లకే క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)కి మరో కీలక సూచన వచ్చింది. అతనిపై తొందరపడి అంచనాలు వేయొద్దని మాజీ టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) అన్నారు. వైభవ్ ఇటీవల ఐపీఎల్‌లో అదరగొట్టాడు. ఆ తర్వాత జూన్‌లో ఇంగ్లండ్‌తో టీ20 అరంగేట్రం చేశాడు. ఇప్పుడు మరోసారి రెడ్ బాల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ ఆడనున్నాడు. ఈ టోర్నీ అతనికి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మరింత అనుభవం అందించే అవకాశం.
వైట్ బాల్ క్రికెట్‌తో పోలిస్తే వైభవ్ రెడ్ బాల్‌లో తక్కువగా ఆడాడు. రంజీ ట్రోఫీ ప్లేట్ లీగ్‌లో 12 ఇన్నింగ్స్‌ల్లో అతని సగటు 17.25గా ఉంది. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు వైభవ్‌తో కలిసి పనిచేశారు. రెండు ఫార్మాట్లలోనూ ఆడే అవకాశం అతనికి ఉపయోగపడుతుందని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. టెస్టు క్రికెట్‌లోనూ రాణించే ఆటగాళ్లు అవసరమని ద్రవిడ్ చెప్పారు. వైభవ్ అన్ని ఫార్మాట్లలో ఎదగాలని ఆకాంక్షించారు.
అయితే వైభవ్ ఇంకా 15 ఏళ్ల వయసులోనే ఉన్నాడని ద్రవిడ్ గుర్తుచేశారు. అతనికి మరింత సమయం, అనుభవం అవసరమన్నారు. ఆరంభంలోనే విజయాలు సాధించినా ముందుకు వెళ్లే క్రమంలో వైఫల్యాలు కూడా ఎదురవుతాయని చెప్పారు. అందుకే వైభవ్ అభివృద్ధికి అందరూ ఓపికగా ఉండాలని ద్రవిడ్ సూచించారు. దులీప్ ట్రోఫీతో వైభవ్‌కు రెడ్ బాల్ క్రికెట్‌లో మరింత అనుభవం లభించనుంది. అతని ఎదుగుదలలో ఈ అవకాశాలు కీలకంగా మారనున్నాయి.

