రేవంత్ అమెరికా పర్యటన రద్దు.. కేంద్రంపై ఖర్గే సంచలన ఆరోపణలు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతులు ఇవ్వకపోవడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రాజకీయ కారణాలతోనే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ అంశంపై ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే (Kharge) స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను కేంద్రం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఆరోపించారు.

ఈ సందర్భంగా విదేశాంగశాఖ నిర్ణయంపై ఖర్గే ఫైర్ అయ్యారు. రాజకీయ కారణాలతోనే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అనుమతి రద్దు చేశారని మండిపడ్డారు. అమెరికాలో తెలంగాణ, ఏపీకి చెందిన ఎన్నారైలు భారీ సంఖ్యలో ఉన్నారని.. వారికి స్వదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉంటుందని తెలిపారు. ఇటువంటి తరుణంలో తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించడానికే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లాలని అనుకున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వేళ పెట్టుబడులు వస్తాయని.. తద్వారా నిరుద్యోగాలకు ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. సీఎంల విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. సీఎంలు తీసుకువచ్చే పెట్టుబడుల వల్ల కర్మాగారాలు 50 సంవత్సరాల పాటు నిలిచి ఉంటాయని చెప్పారు. కాబట్టి సీఎంల విదేశీ పర్యటనలను అడ్డుకోవడం తగదని హితవు పలికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>