కలం, వెబ్ డెస్క్ : కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న కేరళ (Kerala)లో యూడీఎఫ్ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఉత్కంఠగా సాగిన సీఎం ఎంపిక ప్రక్రియలో కాంగ్రెస్ అధిష్ఠానం వీడీ.సతీశన్ వైపే మొగ్గు చూపింది. ఈ క్రమంలో ఆయన రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరువనంతరపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జు ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేరళ (Kerala) గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను ముఖ్యమంత్రి అభ్యర్థి వీడీ.సతీశన్ లోక్ భవన్ లో కలిశారు. రేపు ప్రమాణ స్వీకారం చేసే 20 మంది క్యాబినెట్ మంత్రుల జాబితాతో కూడిన లేఖను అందజేశారు.
ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్..
1) పీకే కున్హాలికుట్టి
2) రమేష్ చెన్నితాల
3) కె మురళీధరన్
4) సన్నీ జోసెఫ్
5) మోన్స్ జోసెఫ్
6) శిబు బేబీ జాన్
7) అనూప్ జాకబ్
8) సీపీ జాన్
9) ఏపీ అనిల్ కుమార్
10) ఎన్ సంసుధీన్
11) పీసీ విష్ణునాథ్
12) రోజి ఎం జాన్
13) బిందు కృష్ణ
14) ఎం లిజు
15) కేఎం షాజీ
16) పీకే బషీర్
17) వీఈ అబ్దుల్ గఫూర్
18) టీ సిద్ధిక్
19) కేఏ. తులసి
20) ఓజే జనీష్
కాగా, ప్రొటెం స్పీకర్ గా తిరువంచూర్ రాధాకృష్ణన్, డిప్యూటీ స్పీకర్‌గా షానిమోల్ ఉస్మాన్ వ్యవహరించనున్నారు.

