బీసీ బంద్ సమయంలో తెరిచి ఉన్న షాపుల దగ్గర నిరసన తెలిపిన బీసీ నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని బీసీ జేఏసీ ఛైర్మన్ ఆర్ కృష్ణయ్య(R Krishnaiah) డిమాండ్ చేశారు. బీసీ బంద్‌ను తాము శాంతియుతంగా నిర్వహించామని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలపడం ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు అని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా బీసీ నాయకులపై పెట్టిన కేసుల వ్యవహారంతో డీజీపీ శివధర్‌తో రేవంత్ రెడ్డి మాట్లాడాలని, కేసులు ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
R Krishnaiah | అయితే బీసీ బంద్ సమయంలో పలు చోట్లు బీసీ నాయకులు దాడులు చేశారు. తెరిచి ఉన్న టిఫిన్ దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు, షో రూమ్‌లపై దాడులు చేసి మూయించారు. చిరు వ్యాపారులపై సైతం దాడులు చేశారు. బీసీల కోసం తాము బంద్ నిర్వహిస్తుంటే.. మీరెలా వ్యాపారాలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Read Also: ఒక్క రాత్రిలో అంతా కోల్పోయాం: రాపో

