Mobile Popup Ad
Mobile Popup Ad

క్వాడ్ సదస్సుకు ఢిల్లీ సిద్ధం: నేడు విదేశాంగ మంత్రుల భేటీ

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ వేదికగా నేడు క్వాడ్ విదేశాంగ మంత్రుల (Quad Foreign Ministers) కీలక సమావేశం ప్రారంభం కానుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన ఈ ఉన్నత స్థాయి సదస్సు జరగబోతోంది. అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

ఈ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు ఇప్పటికే భారత్ చేరుకున్నారు. ప్రాంతీయ సవాళ్లు, పరస్పర సహకారం, ఉగ్రవాద నిర్మూలన లాంటి అంశాలపై నాలుగు దేశాల ప్రతినిధులు సమీక్షించనున్నారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>