కలం, వెబ్ డెస్క్: సీబీఎస్ఈ (CBSE) పరీక్షల్లో కేంద్ర విద్యా శాఖ నిర్లక్ష్యం ఆధారాలతో సహా బయటపడింది. పరీక్షల ప్రశ్నాపత్రంపై ట్రాకింగ్, భద్రత కోసం ఏర్పాటు చేసే క్యూ ఆర్ కోడ్ (QR Code) విషయంలో అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శించారు. క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే యూట్యూబ్‌లోని ఓ పాట ఓపెన్ అవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఓ విద్యార్థిని ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం 12వ తరగతి మ్యాథ్స్ పరీక్ష రాసిన ఓ విద్యార్థిని క్యూ ఆర్ కోడ్ బాగోతాన్ని బయటపెట్టింది. పరీక్ష రాసి వచ్చాక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూస్తే యూట్యూబ్ సాంగ్ వస్తుందని లైవ్‌లో స్కాన్ చేసి చూపెట్టింది. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి చెక్ చేస్తున్నారు. కొందరు దీనికి నవ్వుకుంటుంటే మరికొందరు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇక కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కావాలని ఇలా చేస్తారని, ఇలాంటివి నమ్మొద్దని కామెంట్ చేస్తున్నారు.
Read Also: వాణిజ్య గ్యాస్ సరఫరాపై నిఘా.. ముగ్గురు అధికారులతో కమిటీ
Follow Us On: X(Twitter)

