కొత్త గవర్నర్‌కు సీఎం స్వాగతం.. రేపే ప్రమాణం

కలం, తెలంగాణ బ్యూరో : కొత్త గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy), శాసన వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం లోక్‌భవన్‌కు వెళ్లిన సీఎం టీమ్ గవర్నర్ దంపతులతో కొద్దిసేపు ముచ్చటించింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రి శ్రీధర్‌బాబు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, గవర్నర్ కార్యదర్శి దానకిషోర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇంతకాలం హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రానికి గవర్నర్‌గా కొనసాగిన శివప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులతో తెలంగాణకు బదిలీ అయ్యారు. ఇంతకాలం తెలంగాణ గవర్నర్‌గా కొనసాగిన జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. దాదాపు ఏడాదిన్నరకు పైగా జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్‌గా కొనసాగారు. కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం, అధికారులు, ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరుకానున్నారు.

Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు బిగ్ రిలీఫ్

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>