రేవంత్ రెడ్డి పాలన ఒక ‘చెత్త సినిమా’ .. మాజీ మంత్రి పువ్వాడ ఫైర్

కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పరిపాలన ఒక ‘చెత్త సినిమా’ను తలపిస్తోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం అశ్వాపురంలోని నూతన బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ​రైతుల సమస్యలను ప్రశ్నిస్తే ప్రతిపక్షాల రక్తం పారిస్తామనడం సీఎం రేవంత్ రెడ్డి రక్తపిపాసి మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.

మేడిగడ్డ గేట్లు మూయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయవచ్చని రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం లేఖ రాసినా ప్రభుత్వానికి సోయి లేకపోవడం విచారకరమన్నారు. కాళేశ్వరం నీళ్లిస్తే ఎక్కడ కేసీఆర్ గొప్పతనం ఒప్పుకోవాల్సి వస్తుందోననే కుయుక్తులతో, లక్షలాది క్యూసెక్కుల గోదావరి జలాలను సముద్రం పాలు చేస్తున్నారని ఆరోపించారు. భద్రాచలానికి ముప్పు మేడిగడ్డ వల్ల కాదు, పోలవరం వల్లేనని స్పష్టం చేశారు.

​ఎన్నికల సమయంలో భద్రాద్రి రాముని సాక్షిగా ఇచ్చిన రుణమాఫీ, మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని పువ్వాడ (Puvvada Ajay Kumar) విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో వేగంగా సాగిన సీతారామ, సీతమ్మ సాగర్, పాలమూరు ప్రాజెక్టుల పనులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పడకేశాయని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు, సింగరేణి సమస్యలపై బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.​

ఈ సమావేశం అనంతరం పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, రేగా కాంతారావు తదితరులు అశ్వాపురంలో జరిగిన బీఆర్ఎస్ నాయకుడు యార్లగడ్డ బలరాం మాతృమూర్తి సువర్ణలత పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై నివాళులర్పించారు.

Read Also: కమలంలో కలవరం.. ‘ఈటల’ గురి ఎటు?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>