కలం, వెబ్ డెస్క్: వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ (Nagarjuna Yadav) అరెస్ట్ అయ్యారు. గుంటూరులోని ఇంటికి వెళ్లి నాగార్జున యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తామని పోలీసులు చెప్పారని నాగార్జున యాదవ్ కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ పోలీసులం అంటూ అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడంతో కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. ఓ టీవీ ఛానెల్‌లో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
Read Also: నా ప్రశ్నించే స్వరం ఆగదు.. ప్రకాష్ రాజ్ ఫైర్
Follow Us On: X(Twitter)

