కలం, వెబ్ డెస్క్ : విజయవాడ(Vijayawada)లోని ఆటోనగర్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ మెకానిక్ షెడ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించడంతో తీవ్ర నష్టం జరిగింది. షెడ్‌లో మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన ఏడు ప్రైవేట్ బస్సులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ప్రమాద తీవ్రతకు ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే షెడ్‌లోని వైరింగ్‌లో సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఫైర్ సిబ్బంది, పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

