Mobile Popup Ad
Mobile Popup Ad

అసంఘటిత రంగ కార్మికులపై మోదీ సర్కార్ వివక్ష : TUCI

కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను నిజామాబాద్ (Nizamabad) కోటగల్లిలోని జిల్లా పద్మశాలి సంఘం భవనంలో నిర్వచించారు. ఈ క్రమంలో టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. కార్మిక రంగంలో మహిళల పాత్ర, కార్మిక చట్టాలు, నిర్మాణం పని విధానం తదితర అంశాలపై క్లాసులు నిర్వహించారు.

ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కే.సూర్యం, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్ లు మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. కోప్టా చట్టంతో బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుందన్నారు. మహిళా కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపకుండా, వారి ఉపాధిని దెబ్బతీయడం దుర్మార్గమన్నారు. బీడీ కార్మికులకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీరేట్ల పెంపు లేకపోవడంతో, బీడీ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అర్హులైన బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీడీ కార్మికుల కూలీరెట్ల పెంపు, గౌరవప్రదమైన పెన్షన్, మెరుగైన జీవితం కోసం, ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు మరింత చైతన్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రాజేశ్వర్, ఎం వెంకన్న, జిల్లా అధ్యక్షులు బి.మల్లేష్ సహాయ కార్యదర్శి డి.కిషన్, సాయరెడ్డి, లాలయ్య నాయకులు లింగం, కిరణ్, రవి, నాగమణి, శ్రీనివాస్, సునీత, లక్ష్మీ, అజ్మీరా, సత్యగంగు, భాగ్యలక్ష్మి, అనురాధ, నిర్మల, రేవతి, సూర్యకళ , మంజుల తదితరులు పాల్గొన్నారు.

Read Also: అనుకున్నదొక్కటి.. మోడీ ప్లాన్ ఢమాల్..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>