‘ఏప్రిల్ 29 లోపు లొంగిపోండి’.. ప్రధాని మోదీ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్‌లోని బాంకురాలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ (PM Modi) తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. టీఎంసీ గుండాలు, అవినీతిపరులు ఈ నెల 29లోగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలని హెచ్చరించారు. మే 4 తర్వాత ఎవరినీ వదిలిపెట్టామని ఆ పార్టీలోని అక్రమార్కులకు ప్రధాని మోదీ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ సభ్యులు ఇకపై తమ ఆటలు సాగవని గుర్తుంచుకోవాలని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

టీఎంసీ మహిళా రిజర్వేషన్ బిల్లును (Women Reservation Bill) అడ్డుకుని వారి హక్కులను కాలరాస్తోందని ఫైర్ అయ్యారు. టీఎంసీ (TMC) చొరబాటుదారుల కోసం నిబంధనలను ఉల్లంఘిస్తుందని.. రాజ్యాంగ విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లను ప్రోత్సహిస్తోందని విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ తో కలిసి టీఎంసీ కుట్ర చేసిందని మండిపడ్డారు. టీఎంసీ పాలనలో పశ్చిమ బెంగాల్ లో నిరుద్యోగం, పేదరికం తారాస్థాయికి చేరిందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో ఉపాధి కొరత, పరిశ్రమల కొరతకు టీఎంసీనే కారణం అని ధ్వజమెత్తారు. మమతా సర్కార్ పై బెంగాల్ ప్రజలు కోపంతో ఉన్నారన్న ప్రధాని మోదీ (PM Modi).. మమతా సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. ఈ సారి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: రేపు భూపాలపల్లిలో సీఎం రేవంత్ పర్యటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>