Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రాణం తీసిన కల్తీ మద్యం.. 11 మంది మృతి

కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర పుణేలో (Pune) దారుణం చోటు చేసుకుంది. కల్తీ మద్యం (Liquor)  తాగి 11 మంది మరణించారు. పుణే నగర సమీపంలోని పింప్రి–చించ్‌వాడ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు డీసీపీ సందీప్ అతోల్ తెలిపారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు బాధ్యులైన ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశం..

ఈ ఘటనపై స్పందించిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక విచారణలో మెథనాల్ కలిపిన అక్రమ మద్యం కారణంగానే ఈ మరణాలు సంభవించి ఉండొచ్చని ఎక్సైజ్ పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు వాంతులు, కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Read Also: దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: కేంద్ర ప్రభుత్వం

Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>