కొత్త డిస్కం ఏర్పాటు వెనుక చీకటి కోణం : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో వ్యవసాయ రంగానికి ప్రత్యేక విద్యుత్ సేవలు అందించేందుకు కొత్త డిస్కం (Rythu DISCOM) ఏర్పాటు చేయడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. ఉన్న డిస్కంలకు ఆదాయం ఉందని.. అసలు ఆదాయం లేని కొత్త డిస్కంను సృష్టించి అప్పు ఎలా తెస్తారని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.

ఆదాయం లేని వాటిని మన దగ్గర పెట్టుకుని ఆదాయం ఉన్న వాటిని వేరే వాళ్లకు అప్పగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. దున్న పోతును మన దగ్గర పెట్టుకుని పాలిచ్చే బర్రెను వేరే వాడికి అప్పగించే విధంగా ఈ వ్యవహారం ఉందన్నారు. కొత్త డిస్కం ఏర్పాటు కోసం ప్రభుత్వం చెప్పిన ఒక్క కారణం కూడా సరిగ్గా లేదని ఆగ్రహం చేశారు. దీంతో పాటు అనేక సందేహాలు ఉన్నాయని జగదీష్ రెడ్డి (Jagadish Reddy) చెప్పారు.

Read Also: రైతు డిస్కమ్ పేరుతో రేవంత్ సర్కార్ కుట్ర: కవిత

Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>