కలం, వెబ్‌డెస్క్: నెల్లూరు (Nellore) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మర్రిపాడు (Marripadu) మండలం సింగనపల్లి సమీపంలోని 565వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

