ప్రభుత్వ బడులకు ఇంటర్నెట్ : విద్యాశాఖ కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్‌ : ఏడాది ఆగస్టు నాటికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో (TG Govt Schools) హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ఆధునిక విద్యా విధానంలో సాంకేతికత ప్రాధాన్యతను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైతం ప్రపంచస్థాయి విద్యా వనరులను చేరువ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ తరగతులు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ హైస్పీడ్ కనెక్టివిటీ తోడ్పడనుంది. నిర్ణీత గడువులోగా మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేసేలా అధికారులు కసరత్తు వేగవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>