విజయ్‌తో ఆ ఇద్దరు.. మరో వివాదంలో టీవీకే చీఫ్

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టీవీకే చీఫ్ విజయ్ (TVK Chief Vijay) మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలిసి సమావేశం అయ్యారు. పార్టీ మద్దతు దారులతో వెళ్లిన విజయ్ (TVK Chief Vijay) గవర్నర్ కు లేఖ సమర్పించే సమయంలో ఆయన వెంట కర్ణాటక సినీ నిర్మాత కేవీఎన్ వెంకట్, ఏపీ గ్రానైట్ అండ్ మైనింగ్ వ్యాపారస్తుడు విష్ణు రెడ్డి ఉన్నారు.

ప్రోటోకాల్ కు విరుద్ధంగా ఆ ఇద్దరు లోక్ భవన్ కు ఎలా వెళ్లారనే అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటులో నిర్మాతకు ఏం పని అంటూ రాజకీయ ప్రత్యర్థులు మండిపడుతున్నారు. ప్రొడ్యూసర్ ద్వారా లెఫ్ట్ పార్టీలకు డబ్బులు పంచి ఉంటారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ఇద్దరి హస్తం ఉంటుందా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ క్రమంలో టీవీకే చీఫ్ హార్స్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారంటూ ప్రత్యర్థులు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>