కలం, స్పోర్ట్స్ : లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్ (LSG vs GT) లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జాయింట్స్ జట్టు, గుజరాత్ టైటాన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే గుజరాత్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna) నిప్పులు చెరిగే బంతులతో లక్నో బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 28 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టిన ప్రసిద్ధ్, లక్నో భారీ స్కోరు ఆశలపై నీళ్లు చల్లాడు. ఎయిడెన్ మార్క్రామ్ (30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ రిషబ్ పంత్ (18), నికోలస్ పూరన్ (19), అబ్దుల్ సమద్ (18) ఆశించిన స్థాయిలో మెరుపులు మెరిపించలేకపోయారు.
ముఖ్యంగా లక్నో మిడిల్ ఆర్డర్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం ఆ జట్టు రన్ రేట్‌ను గణనీయంగా తగ్గించింది. చివర్లో మహమ్మద్ షమీ (12*) ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో మెరవడంతో లక్నో గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. గుజరాత్ బౌలర్లలో అశోక్ శర్మ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, రబడా చెరో వికెట్ సాధించారు. ఈ పిచ్‌పై 165 పరుగుల లక్ష్యం సవాల్‌తో కూడుకున్నదే అయినప్పటికీ, గుజరాత్ బ్యాటింగ్ లైనప్‌ను లక్నో బౌలర్లు ఎలా కట్టడి చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also: బీ అలర్ట్.. మహిళలకు నిద్రతక్కువైతే ఈ హెల్త్ ఇష్యూస్ అటాక్!
Follow Us On: X(Twitter)

