Mobile Popup Ad
Mobile Popup Ad

మృణాల్ పెళ్లిపై అల్లు అర‌వింద్ కామెంట్స్ వైరల్!

క‌లం, వెబ్ డెస్క్‌: సీతారామం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) వ‌రుస‌ సూప‌ర్ హిట్ల‌తో స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది. ఇటీవ‌ల డెకాయిట్ సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన స‌క్సెస్ మీట్ల‌తో మృణాల్‌ బిజీబిజీగా ఉంది. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ డెకాయిట్‌ స‌క్సెస్‌ మీట్‌లో ప్ర‌ముఖ నిర్మాత‌ అల్లు అర‌వింద్ (Allu Aravind) మృణాల్ పెళ్లిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సీతారామంలో సీత‌గా ఎంతో మెప్పించావ‌ని మృణాల్‌పై అల్లు అరవింద్‌ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.

ఇక డెకాయిట్‌లో చాలా విభిన్న పాత్ర పోషించావ‌ని, ఎమోష‌న్స్ ఎంతో బాగా పండించావ‌ని మెచ్చుకున్నారు. ఇక ఇది వ‌ర‌కు తాను ఒక అమ్మాయిని దీవించాన‌ని, తాను వ‌రుణ్‌తేజ్‌కు భార్య అయ్యింద‌ని లావ‌ణ్య త్రిపాఠిని గుర్తు చేశారు. అలాగే మృణాల్ (Mrunal Thakur) కూడా ఇక్క‌డి అబ్బాయినే పెళ్లి చేసుకొని సెటిల్ కావాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. అదే జ‌ర‌గాల‌ని త‌న‌ను దీవిస్తున్న‌ట్లు చెప్పారు. దీనికి మృణాల్ సిగ్గుతో న‌వ్వేసింది. దీంతో మృణాల్ పెళ్లిపై గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. మృణాల్ ఎవ‌రైనా తెలుగు సెల‌బ్రెటీతో ల‌వ్‌లో ఉందా? అల్లు అర‌వింద్ ఈ కామెంట్స్ అందుకే చేశాడా? అన్న చ‌ర్చ మొద‌లైంది.

Read Also: బీ అలర్ట్.. మహిళలకు నిద్రతక్కువైతే ఈ హెల్త్ ఇష్యూస్ అటాక్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>