ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీకి జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒవైసీ ముందు హైదరాబాద్‌ను కాపాడుకోవాలని, ఆ తర్వాత బీహార్‌వైపు రావాలని సూచించారు. సీమాంచల్ ముస్లింలు 2020లో చేసిన తప్పును మళ్ళీ రిపీట్ చేయరని అన్నారు పీకే. బీహార్‌లో బీహార్‌కు చెందిన వారే నేతలుగా ఉండాలని పీకే అభిప్రాయపడ్డారు. ‘‘ఒవైసీ నా స్నేహితుడు, అతనికి నేను ఇచ్చే సలహా ఒకటే.. అది అతను ముందు హైదరాబాద్‌ను హ్యాండిల్ చేసుకోమని. హైదరాబాద్‌లో నీ కోటను కాపాడుకో. సీమాంచల్‌కు వచ్చిన అనవసర గందరగోళం సృష్టించవద్దు’’ అని అన్నారు పీకే.
‘‘ఒకసారి హైదరాబాద్‌ను హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశాక.. అక్కడ ఉన్న ముస్లింలకు సంక్షేమాన్ని అందించు. అలా చేస్తే చాలా బాగుండేది. ఈసారి బీహార్ ముస్లింలు 2020లో చేసిన తప్పును రిపీట్ చేయరు. ఒవైసీ(Asaduddin Owaisi).. ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి. కానీ, అతనిని హైదరాబాద్‌లోనే ఉండనిద్దాం. హైదరాబాద్ నేతను ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు’’ అని పీకే(Prashant Kishor) వ్యాఖ్యానించారు.
Read Also: మూసీ మాస్టర్ ప్లాన్ రెడీ..

