ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma)పై ఇటీవల సంచలన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. “ప్రశాంత్ వర్మ రూ.10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకుని సినిమా చేయలేదంటూ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ఫిర్యాదు చేసింది” అంటూ ప్రశాంత్ వర్మపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను తాజాగా ప్రశాంత్ వర్మ ఖండించారు. తనపై వస్తున్న వార్తలన్నీ అసత్యమని, ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని ప్రశాంత్ వర్మ తీవ్రంగా ఖండించారు. “ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌తో నాకు ఉన్న వివాదం ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఛాంబర్, డైరెక్టర్స్ అసోసియేషన్ పరిశీలనలో ఉంది. విచారణ పూర్తయ్యే వరకు ఎవరూ ఊహాగానాలు చేయకూడదు. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవి” అని ఆయన ప్రకటన విడుదల చేశారు.
‘ఆవు’, జాంబీ రెడ్డి’, కల్కి (రాజశేఖర్ హీరో) ‘హను-మాన్’ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు సినిమాకు కొత్త శైలి తీసుకువచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma). తన స్వతంత్ర ఆలోచనలు, సాంకేతిక ప్రావీణ్యం, విజువల్ ప్రెజెంటేషన్‌తో యువ దర్శకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘హను-మాన్’ వంటి విజువల్ వండర్ సినిమా విజయంతో ఆయనపై అంచనాలు పెరిగాయి. ‘అధీర’, ‘మహాకాళీ’, ‘జై హనుమాన్’, ‘బ్రహ్మరాక్షస’ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.
వివాదం వెనుక కుట్ర ఉందా?
‘హను-మాన్’ భారీ విజయానంతరం ప్రశాంత్ వర్మపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఆయన తదుపరి సినిమాల బిజినెస్ భారీ మొత్తాల్లో జరుగుతుందని అంచనా. ఈ సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం యాదృచ్ఛికం కాదనే అభిప్రాయం కొందరిదీ. వ్యాపార ప్రయోజనాల కోణంలోనూ, వ్యక్తిగత ఈగో లెవల్లోనూ కొన్ని వర్గాలు ఆయనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయనేది మరో విశ్లేషణ.
Read Also: ఆ సినిమా నా మీద ఎంతో ప్రభావం చూపింది : సందీప్ రెడ్డి వంగా
Follow Us On : Instagram

