సన్నబియ్యం పంపిణీ అంశం ఇప్పుడు రాజకీయంగా కేంద్రబిందువుగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం పథకానికి కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ నిధులు ఇస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రచారసభల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే సన్నబియ్యం పంపిణీ ఆగిపోతుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సీఎం ప్రజలను బెదిరిస్తూ బియ్యం పథకాన్ని ఓట్లతో ముడిపెట్టారని ఆరోపించారు. అయితే కిషన్ రెడ్డి కామెంట్లను కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చుతున్నారు. కిషన్ రెడ్డి చెబుతున్నది నిజమైతే మిగిలిన రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు పంపిణీ చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.
“జూబ్లీహిల్స్(Jubilee Hills) ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ ఓట్లు దక్కించుకోవడానికే బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఓటు పొందడానికి మతపరమైన రాజకీయాలు ప్రోత్సహించడం కాంగ్రెస్ కొత్త ట్రిక్” అని విమర్శించారు. కిషన్‌రెడ్డి(Kishan Reddy) మాట్లాడుతూ.. “సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ప్రజలను బెదిరించడం సిగ్గుచేటు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే సన్నబియ్యం పథకం రద్దవుతుందని బెదిరించడం ఎలాంటి ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో భయపెట్టి ఓట్లు కోరడం తగదు” అని అన్నారు. సీఎం వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఆయన, “ఇది ఎన్నికల నియమావళి స్పష్టమైన ఉల్లంఘన. బీజేపీ తరఫున ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. చట్టపరమైన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.
‘రాష్ట్రం చేస్తున్నది ఉచిత బస్సు ఒక్కటే’
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కూడా ఆయన విమర్శలు చేశారు. “రాష్ట్రం ఆధ్వర్యంలో నిజంగా నడుస్తున్న పథకం ఒక్కటే ఉంది. ఉచిత బస్సు. అది కూడా మహిళలను మోసం చేసే పథకంగా మారింది. బియ్యం, గృహనిర్మాణం, పెన్షన్లకు సంబంధించిన ప్రధాన పథకాలు అన్నీ కేంద్ర సహకారంతోనే సాగుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తమ సొంతం అని చెప్పుకుంటోంది” అని అన్నారు.
Read Also: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై కేసు
Follow Us On : Instagram

