రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Chevella) మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్ – బీజాపూర్ రహదారిపై టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. కంకర లోడుతో ఉన్న టిప్పర్ లారీ స్పీడుగా వచ్చి బస్సును ఢీకొనడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సులో కంకర పడడంతో మరికొంతమంది ప్రయాణికులు కంకర కింద కూరుకుపోయారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు, స్థానికులు కలిసి క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read Also: అవన్నీ తప్పుడు వార్తలు… ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ వర్మ
Follow Us On : Instagram

