epaper
Wednesday, February 18, 2026
epaper

స్పిరిట్ : రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “స్పిరిట్” (Spirit). ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఎవ్వరూ చూపించని రేంజ్‌లో ప్రభాస్‌ను సందీప్ వంగా ప్రెజెంట్ చేయనున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రి (Tripti Dimri) హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ముందుగా ఈ సినిమాలో దీపికా పదుకోన్ ని హీరోయిన్ గా అనుకున్నా కొన్ని అనుకోని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. అలాగే ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ జైలర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రకాష్ రాజ్ సైతం కొన్ని క్రియేటివ్ డిఫరెన్సస్ వల్ల స్పిరిట్ (Spirit) నుంచి తప్పుకున్నాడని ఇటీవల న్యూస్ వైరల్ అయింది. తాజాగా ఈ రూమర్స్ పై ప్రకాష్ రాజ్ స్పందించారు. స్పిరిట్ మూవీలో నా సీన్స్ ఘాట్ కూడా ఇంకా మొదలు అవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కథలు అల్లేస్తున్నారు. ఎంతకాలం ఈ రాతలు గ్రో అప్ అవ్వండి అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.

 Read Also: మనసంతా నువ్వే గ్రాండ్ రీ రిలీజ్.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఎమోషనల్ వీడియో

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>