కలం, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) కేంద్రం సభా హక్కుల ఉల్లంఘన (Privilege Notice) నోటీస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సభలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరిపై ఆధారాలు లేని ఆరోపణలు చేశారని, వాటికి స్పీకర్ వద్ద వివరణ ఇవ్వాలని కోరనుంది. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బుధవారం సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ అమెరికాతో ట్రేడ్ డీల్ ఒప్పందంపై తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు ఆరోపణలు చేశారు. అనంతరం రాహుల్ వ్యాఖ్యలపై కిరణ్ రిజుజు (Kiran Rijiju) స్పందించారు. సభను తప్పుదారి పట్టించేలా, ఆధారంలేని ఆరోపణలు చేసినందుకు ప్రతిపక్ష నేతకు ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
అవి తీవ్ర ఆరోపణలు.. కిరణ్ రిజుజు
అంతకుముందు ప్రివిలేజ్ నోటీస్ (Privilege Notice) ఇచ్చే అంశంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడారు. ‘సభలో మరో సభ్యుడిపై తీవ్ర ఆరోపణలు చేయాలంటే ముందుగా నోటీసు ఇవ్వాలి. వాటికి ఆధారాలు చూపించాలనే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. దీనికి విరుద్ధంగా రాహుల్ మాట్లాడారు. సభను తప్పుదారి పట్టించారు. ఆయన చేసిన ప్రకటనలు పూర్తిగా అసత్యం, ఆధార రహితం’ అని మంత్రి అన్నారు.
‘ప్రధాని దేశాన్ని, దేశ ప్రయోజనాలను అమ్మేశారని రాహుల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం. ఏ ఆధారంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు? కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరిపైనా ఇలాగే ముందస్తు నోటీస్ ఇవ్వకుండా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ప్రసంగమంతా తప్పుడు వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు, అసభ్య పదజాలంతో నిండిపోయింది. వాటిని రికార్డుల నుంచి తొలగించాలి’ అని స్పష్టం చేశారు.
‘ఈ దేశాన్ని ఎవరూ అమ్మలేరు, కొనలేరు. అయినా, దేశాన్ని అమ్మేశారని, కొనేశారని రాహుల్ వ్యాఖ్యానించారు. భారత్‌ను కొనడం లేదా అమ్మడం అనే ఆలోచన కూడా అసంభవం’ అని రిజిజు పేర్కొన్నారు.
Read Also: స్పిరిట్ : రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్
Follow Us On: Instagram


