Mobile Popup Ad
Mobile Popup Ad

గల్లీ క్రికెట్ నుంచి ఐపీఎల్ స్టార్‌గా.. ప్రఫుల్ హింగే బ్యాక్‌స్టోరీ ఇది!

కలం, స్పోర్ట్స్: ఒక్క మ్యాచ్‌లో క్రికెట్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన బౌలర్ ప్రఫుల్ హింగే (Praful Hinge). ఇంటర్నేషన్ బౌలర్లను సైతం ఒక ఆట ఆడుకున్న 15ఏళ్ల వైభవ్ సూర్యవంశీని తొలి బంతికే ఔట్ చేసి పెవిలియన్ చేర్చిన యంగ్ బౌలర్. వైభవ్ ఒక్కడినే కాదు ఆ తర్వాత వచ్చిన జురెల్‌ను కూడా డకౌట్ చేశాడు. ఐపీఎల్ (IPL) చరిత్రలోనే తొలి ఓవర్‌లో మూడు వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఇంతటి ఘనత సాధించింది తన తొలి అరంగేట్ర మ్యాచ్‌లో. దీంతో ప్రఫుల్ హింగే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. అసలు ఎవరతను? ఎక్కడ కోచింగ్ తీసుకున్నాడు? అన్న విషయాలు టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయాయి. ఈ విషయాలను అతని తండ్రి ప్రకాష్ హింగే భావోద్వేగపూరిత విషయాలను పంచుకున్నారు.

ప్రకాష్ హింగే మహారాష్ట్ర విద్యుత్ బోర్డులో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. వారి కుటుంబంలో చదువుకు అత్యంత ప్రాధాన్యత ఉండేది. ప్రఫుల్ సోదరి చార్టర్డ్ అకౌంటెంట్‌గా స్థిరపడటంతో, ప్రఫుల్ కూడా ఉన్నత చదువులు చదవాలని తండ్రి ఆశించారు. కానీ ప్రఫుల్‌కు మాత్రం క్రికెట్ అంటే ప్రాణం. రోజంతా వీధి క్రికెట్ ఆడుతూ గడిపేవాడని, కొడుకు పిచ్చిని చూసి ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్ అకాడమీలో చేర్పించానని ప్రకాష్ గుర్తు చేసుకున్నారు. అయితే అకాడమీలో చేరిన తర్వాత ప్రఫుల్ మైదానమే తన ఇల్లుగా మార్చుకున్నాడని ఆయన తెలిపారు.

కెరీర్ మధ్యలో ప్రఫుల్ (Praful Hinge) ఎదుర్కొన్న వెన్ను గాయం కుటుంబం మొత్తాన్ని ఆందోళనకు గురిచేసింది. ఆ సమయంలో అతని క్రికెట్ ప్రయాణం ముగిసిపోయిందని అందరూ భయపడ్డారు. కానీ సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad) బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ దేవదూతలా ఆదుకున్నారని ప్రకాష్ పేర్కొన్నారు. గాయాల నుంచి ఎలా కోలుకోవాలో వరుణ్ దగ్గరుండి నేర్పించారని చెప్పారు. అలాగే ప్రఫుల్ బౌలింగ్‌కు ముగ్ధుడైన ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్, తమపై ఒక్క రూపాయి భారం పడకుండా బ్రిస్బేన్‌లో శిక్షణ ఇప్పించారని వివరించారు. చదువు కావాలనుకున్న తండ్రి ఆశయానికి తోడు, తన క్రికెట్ కలపై ప్రఫుల్ చూపిన పట్టుదలే ఈరోజు అతడిని స్టార్‌గా మార్చింది. ఒక సామాన్య మధ్యతరగతి యువకుడు పట్టుదలతో తలరాతను మార్చుకోవచ్చని ప్రఫుల్ నిరూపించాడు. ఈ విజయం పట్ల అతని కుటుంబం, క్రీడా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది.

Read Also: షాకింగ్.. మే 1 నుంచి థియేటర్ల బంద్..?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>