Mobile Popup Ad
Mobile Popup Ad

క్యాబినెట్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఉంటే తప్పేంటి?: జగ్గారెడ్డి

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి (Jaggareddy)  సంచలన కామెంట్లు చేశారు. క్యాబినెట్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఉంటే తప్పేంటి? అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రికి కూడా ఇదే విషయం చెప్తానన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కంటిన్యు చేయాలని.. రాజగోపాల్‌రెడ్డిని కూడా క్యాబినెట్ లోకి తీసుకోవాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడతూ.. పలు సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం జరగబోతున్నదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తానన్నారు. దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా దెబ్బతీసే కుట్రకు బీజేపీ తెరలేపిందని ఆరోపించారు.

బండి సంజయ్ ఆరోపణలు పట్టించుకోవద్దు

కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలను పెద్దగా సీరియస్‌గా తీసుకోవద్దని జగ్గారెడ్డి (Jaggareddy) పేర్కొన్నారు. బండి సంజయ్ విమర్శల లీడర్ అని పేర్కొన్నారు. మాజీమంత్రి హరీశ్ రావు నిత్యం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆయన ఆరోపణలకు పెద్దగా విలువ లేదని జగ్గారెడ్డి విమర్శించారు. సంగారెడ్డి, పటాన్‌చెరు పరిధిలో పొంగులేటి భూదందాలు చేస్తున్నారనడం తప్పుడు ఆరోపణలు అని పేర్కొన్నారు. సీతక్క‌పై బీఆర్ఎస్ నేతలవి కామన్ సెన్స్ లేని ఆరోపణలని కొట్టిపారేశారు.

పీసీసీ చీఫ్ కంటిన్యూ కావొచ్చు

పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మరోసారి కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. బీసీ నినాదం అంశంపై మాట్లాడుతూ.. బీసీలను అణగదొక్కుతున్నారన్న వార్తలు చూసి తాను ఫీల్ అయ్యాయనని చెప్పారు. గ్రామాల్లో రెడ్లు, బీసీలు కలిసే ఉంటారని వ్యాఖ్యానించారు. తనది జనరల్ సీటు అని వచ్చే ఎన్నికల్లో బీసీ అయిన తన భార్యను పోటీకి దించుతానంటూ ప్రకటించారు. బీఆర్ఎస్ పాలనలో బీసీలకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. సీఎం, పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక మంత్రులంతా అగ్రవర్ణాలకు చెందిన వారే కదా అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు మేలు చేశామని చెప్పుకోవడంలో అర్థం లేదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానంటూ కేసీఆర్ ప్రకటిస్తే ఆయనను ఎవరైనా ప్రశ్నించారా? అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Read Also: డీలిమిటేషన్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>