కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ (Tollywood) లో నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాల (ఎగ్జిబిటర్లు) మధ్య రెవెన్యూ షేరింగ్ వివాదం తీవ్రమైంది. పెరిగిన నిర్వహణ ఖర్చులు, ఓటీటీల ప్రభావంతో నష్టాల్లో ఉన్నామని.. కలెక్షన్లలో వాటా కావాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. అయితే నిర్మాణ వ్యయం పెరుగుతున్నందున రెవెన్యూ షేరింగ్ వల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిర్మాతల గిల్డ్ అంటోంది. దీంతో ఎగ్జిబిటర్ల కోరికను నిర్మాతల గిల్డ్ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మే 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మే నెలలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాల్సిన భారీ చిత్రాల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది.
గతేడాది జూన్ టైంలో కూడా ఇలానే వివాదం తలెత్తింది. దీంతో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో మూవీ ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలను ఆపేందుకు దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్వయంగా పవన్ కళ్యాణే సీరియస్ కావడం జరిగింది. దీంతో ఆగ్ర నిర్మాతలు ప్రెస్ మీట్ మరీ దానిపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. త్వరలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య రెవెన్యూ షేరింగ్ ఉంటుందని తేల్చడంతో ఈ విషయం సద్దుమణిగింది. కానీ ఇప్పుడు రెవెన్యూ షేరింగ్ ఇచ్చేందుకు నిర్మాతల గిల్డ్ వ్యతిరేకిస్తోంది. దీంతో మే 1 నుంచి థియేటర్ల మూసివేతకు రంగం సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలాఉంటే సమ్మర్ సీజన్ ను క్యాష్ చేసుకుందామని భావిస్తున్న పలు క్రేజీ ప్రాజెక్టులపై ఈ ఇష్యూ తీవ్ర ప్రభావం చూపెట్టనుంది. నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’, అలాగే సమంత ప్రధాన పాత్రలో నటించనున్న ‘మా ఇంటి బంగారం’ , మెగా ప్రీన్స్ డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘కొరియన్ కనకరాజు’, తమిళ స్టార్ హీరో సూర్య ‘కరుప్పు’ కూడా మే నెలలోనే రావాల్సి ఉంది. మరికొన్ని చిన్న చిత్రాలు, మిడియం బడ్జెట్ మూవీస్ కూడా సమ్మర్ రేసులో నిలవాలని ఆశించాయి. అయితే ఇప్పుడు ఈ సమ్మె వార్తలతో ఆయా చిత్రాల నిర్మాతలకు తలనొప్పి మొదలైంది. మే నెలలో సినిమాలు విడుదల అవుతాయా? లేదా? అని ఆయా చిత్రాల నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు.
Read Also: డేటింగ్ సమయంలో పార్ట్‌నర్‌ను అడగాల్సిన 6 ప్రశ్నలు!
Follow Us On: Sharechat

