epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భారీ నిరాశలో ప్రభాస్​ ఫ్యాన్స్​..

కలం, వెబ్​ డెస్క్​ : ప్రభాస్​ హీరోగా డైరెక్టర్​ మారుతి తెరకెక్కించి మూవీ ‘ది రాజా సాబ్​’ (Raja Saab). భారీ బడ్జెట్ తో నిర్మించిన హారర్​–ఫాంటసీ సినిమా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్​ లో రాజాసాబ్​ ప్రీమియర్​ షోలు నడుస్తున్నాయి. అలాగే తమిళనాడు, కర్ణాటకలో బుకింగ్స్​ తెరుచుకున్నాయి. మరోవైపు నైజాంలో ప్రీమియర్​ షోల పై చివరి నిమిషం వరకు తీవ్ర ఉత్కంఠ కొనసాగినా ప్రభాస్​ ఫ్యాన్స్​ కు నిరాశే మిగిలింది.

కాగా, గురువారం రాత్రి ప్రీమియర్​ షోలు పడుతాయని మేకర్స్​ ఇప్పటికే ప్రకటించారు. టికెట్​ రేట్లు పెంచుకోవడానికి ది రాజాసాబ్ నిర్మాతలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం నిర్మాతలకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారు తెలంగాణ ప్రభుత్వానికి టికెట్​ రేట్స్ హైక్​ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారు. కానీ, దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గురువారం రాత్రి వరకు వేచి చూసిన ప్రీమియర్​ షోస్​ పడలేదు. ప్రీమియర్​ షోలు రద్దు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో పాటు ప్రభాస్​ ఫ్యాన్స్ లో తీవ్ర అసహనానికి దారితీసింది. ఇక సాధారణ టికెట్​ ధరలతోనే Raja Saab సినిమా తెలంగాణలో విడుదల కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>