లవ్ మ్యారేజ్ చేసుకుంటా.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!

కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో చర్చ నడుస్తూనే ఉంటుంది. ఎట్టకేలకు తన వివాహంపై ప్రభాస్ క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ తన పెళ్లి గురించి మాట్లాడారు. ‘మీరు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా లేక లవ్ మ్యారేజ్ చేసుకుంటారా’? అన్న ప్రశ్నకు ప్రభాస్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తాను లవ్ మ్యారేజ్‌ వైపు ఆసక్తి చూపుతానని స్పష్టం చేశారు. తనకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి (Love Marriage) చేసుకోవడమే ఇష్టమని ఆయన పరోక్షంగా చెప్పారు.

ప్రభాస్ (Prabhas) పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ప్రకటన ఒక తీపి కబురులా మారింది. ‘డార్లింగ్ మనసు గెలుచుకున్న ఆ బ్యూటీ ఎవరు?’ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ తన ప్రేమను ఎప్పుడు బయటపెడతారో వేచి చూడాల్సిందే!

Read Also: బీ అలర్ట్.. మహిళలకు నిద్రతక్కువైతే ఈ హెల్త్ ఇష్యూస్ అటాక్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>