కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హైదరాబాద్‌లో తన డ్రీమ్ హౌస్ నిర్మిస్తున్నట్లు సినీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. కోకాపేట (Kokapet) ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ప్రభాస్ తన అల్ట్రా లగ్జరీ మాన్షన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలు, హైఎండ్ ఆర్కిటెక్చర్, ప్రైవేట్ గార్డెన్స్, జిమ్, స్విమ్మింగ్ పూల్, ప్రత్యేక హోమ్ థియేటర్ వంటి సదుపాయాలతో ఈ మ్యాన్షన్ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.
భారీ బడ్జెట్ ప్రాజెక్టులు, దేశవ్యాప్తంగా షూటింగ్ షెడ్యూల్స్ మధ్య కూడా ప్రభాస్ తన డ్రీమ్ హౌస్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇటీవల కోకాపేట ప్రాంతం సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల ఫేవరెట్ డెస్టినేషన్‌గా మారుతోంది. విలాసవంతమైన విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, ప్రీమియం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో ఈ ప్రాంతం హాట్‌స్పాట్‌గా నిలుస్తోంది. ఇప్పుడు ప్రభాస్ కూడా అక్కడే తన కొత్త నివాసాన్ని నిర్మించుకోవడం ఆసక్తికరంగా మారింది.
వచ్చే రెండు సంవత్సరాలలో ఈ లగ్జరీ మాన్షన్ పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రాపర్టీ రూపం చూస్తేనే ఇది ఒక “ప్యాలెస్ లాంటి డిజైన్” అని అభిమానులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే దీనిని “రెబల్ ఫోర్ట్”గా పిలుస్తూ అభిమానులు హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేస్తున్నారు.

