కలం, వెబ్‌డెస్క్: రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కూడా వేడుక్కుతున్నాయి. ఈ ట్రాన్స్ ఫార్మర్లకు ఉపశమనం కలిగించేందుకు గోండా విద్యుత్ శాఖ వినూత్న ప్రయోగం చేపట్టింది. ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) లోని గోండా జిల్లాలో విద్యుత్ శాఖ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. 45 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటుతున్న ఉష్ణోగ్రతలతో ట్రాన్స్‌ఫార్మర్లు వేడెక్కి ట్రిప్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో వాటిని చల్లబరిచేందుకు టేబుల్ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. అయితే, తాత్కాలిక ఉపశమనం కోసం ఈ ఏర్పాటు చేశామని, ఫ్యాన్ గాలికి ఉపరితల ఉష్ణోగ్రత కొంత తగ్గుతుందని అధికారులు తెలిపారు. అయితే ఇంత పెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌కు ఇంత చిన్న ఫ్యాన్ ఎంతవరకు ఉపయోగపడుతోందని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) గా మారింది.
యూపీ విద్యుత్ శాఖ అధికారులు వినూత్న ఆలోచన
-ట్రాన్స్‌ఫార్మర్లు చల్లబరిచేందుకు టేబుల్ ఫ్యాన్లు ఏర్పాటు
-పెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌కు చిన్న ఫ్యాన్ పెడితే ఎలా కూల్ అవుతాదని సోషల్ మీడియాలో ట్రోల్స్UP Power Dept Deploys Table Fans to Cool Overheating Transformers Amid Severe Heatwave… pic.twitter.com/Qlu7gLK6xe
— Kalam Daily (@kalamtelugu) May 25, 2026
Read Also: ఆసియా రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరిన భారత్!
Read Also: మన గుడులు.. మన సంస్కృతి

