epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

జపాన్ లో ప్రభాస్ సందడి.. రాజమౌళి ఏమన్నాడంటే..?

కలం, వెబ్ డెస్క్ : బాహుబలి ప్రభాస్(Prabhas) జపాన్ వెళ్లాడు. తెలుగు సినిమాలకు జపాన్ లో మంచి క్రేజ్ ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. దాన్ని క్యాష్ చేసుకునేందుకు బాహుబలి ది ఎపిక్ ను అక్కడ రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ జపాన్(Japan) వెళ్లి ప్రచారం చేస్తున్నాడు. గతంలో కూడా బాహుబలికి అక్కడ మంచి కలెక్షన్లు వచ్చాయి. అప్పటి నుంచే ప్రభాస్ తన సినిమాలను అక్కడ రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రచారానికి స్వయంగా ప్రభాస్ వెళ్లడంతో మూవీ మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అక్కడ రాజమౌళి(Rajamouli) రాసిన లెటర్ ను ప్రభాస్ అందరి ముందు పంచుకున్నాడు. ఆ లెటర్ లో ఎమోషనల్ టచ్ ఇచ్చాడు జక్కన్న.

‘నేను జపాన్ వెళ్లినప్పుడల్లా ప్రభాస్(Prabhas) ఎప్పుడొస్తాడు అని అడిగేవాళ్లు. ఇన్ని రోజులకు నా బాహుబలి అక్కడ అడుగు పెట్టాడు. నీ మీద వాళ్లకు ఎంత ప్రేమ ఉందో చూస్తున్నావు. వాళ్లు నీ మీద చూపించే ప్రేమకు నువ్వు ఎమోషనల్ అయిపోతావు. జపాన్ లోని మా అభిమానులందరికీ మరోసారి ధన్యవాదాలు చెబుతున్నా’ అని రాసుకొచ్చాడు రాజమౌళి. ప్రభాస్ ఈ లెటర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బాహుబలి రెండు పార్టులను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఇండియాలో రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్లు వచ్చాయి. దాన్నే ఇప్పుడు జపాన్ లో డిసెంబర్ 12న రిలీజ్ చేయబోతున్నారు.

Read Also: జో రూట్ నయా రికార్డ్.. కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>