epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

జో రూట్ నయా రికార్డ్.. కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ

ఇంగ్లాండ్‌(England) స్టార్ బ్యాటర్‌ జో రూట్(Joe Root) తన కెరీర్‌లో మరో రికార్డ్ సృష్టించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే–నైట్ పింక్ బాల్ రెండో టెస్ట్‌లో అజేయ శతకంతో చెలరేగి చరిత్ర సృష్టించాడు. ఆసీస్ నేలపై ఇప్పటివరకు శతకం నమోదు చేయకపోయిన రూట్, ఈ మ్యాచ్‌లో ఆ ప్రతిష్టాత్మక మైలురాయిని చేరుకున్నాడు. ఈ సెంచరీతో రూట్ టెస్టుల్లో మొత్తం 40 శతకాల క్లబ్‌లో నిలిచాడు. ఆస్ట్రేలియాపై మూడు అంకెల స్కోరు సాధించేందుకు అతడికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. తాజా టూర్‌లో మూడు ఇన్నింగ్స్‌ల తర్వాతే ఈ విజయాన్ని అందుకున్నాడు.

తొలి టెస్ట్‌లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచిన రూట్(Joe Root), రెండో టెస్ట్‌లో చెలరేగాడు. తనదైన శైలిలో బ్యాటింగ్‌ చేస్తూ 83 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత దూకుడు పెంచాడు. 181 బంతుల్లో శతకాన్ని పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా గడ్డపై మొత్తం 1000 పరుగుల మార్క్‌ను కూడా చేరుకున్నాడు. ఇప్పటివరకు అక్కడ 30 ఇన్నింగ్స్‌లలో రూట్ 1006 పరుగులు చేశాడు. వీటిలో కొత్త శతకంతో పాటు 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కూడా జో రూట్ రికార్డుల పరంపర కొనసాగుతున్నాయి. ఇది ఆయనకు 22వ శతకం, డబ్ల్యూటీసీలో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్‌గా మరింత ముందంజలో నిలిచాడు. అతడికి దరిదాపుల్లో స్టీవ్ స్మిత్ (13), మార్నస్ లబుషేన్ (11), కేన్ విలియమ్సన్ (11), శుభ్‌మన్ గిల్ (10) ఉన్నారు.

ఇంగ్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా రూట్ అగ్రస్థానాన్ని మరింత బలపరిచాడు. అతడి ఖాతాలో ఇప్పుడు 59 అంతర్జాతీయ శతకాలు ఉన్నాయి. అలిస్టర్ కుక్ (38), కెవిన్ పీటర్సన్ (32), గ్రహమ్ గుచ్ (28), ఆండ్రూ స్ట్రాస్ (27) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Read Also: ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై !

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>