కలం, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సంక్షోభం కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరుసగా నాలుగో రోజు కూడా ఇండిగో (Indigo) సర్వీసులకు అంతరాయం కలగడంతో విమానాశ్రయాల్లో గంటల తరబడి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఒక్కరోజే దాదాపు 1000 విమాన సర్వీసులు రద్దు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. హైదరాబాద్ కు రావాల్సిన 26 సర్వీసులు రద్దుకాగా, ఇక్కడి రావాల్సిన 42 విమానాలు రద్యయ్యాయి. ముంబై ఎయిర్ పోర్టులో 109, డిల్లీలో 106, బెంగళూరు 124, ముంబై 109, పూణేలో 42 విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి.
ఈ క్రమంలోనే ఇండిగో ఇష్యూ సుప్రీం (Supreme Court) కోర్టుకు చేరింది. 1000కి పైగా ఇండిగో విమానాల రద్దుపై పిల్ దాఖలయింది. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా దీనిపై స్పందించాలని ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు పిటిషనర్లు. సీజేఐ నివాసాన్ని సంప్రదించి తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు కూడా ఇండిగో(Indigo) విమానాల సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయడానికి వీలుగా పిటిషనర్ తరపు న్యాయవాదిని అత్యవసర విచారణ కోసం సీజేఐ తన ఇంటికి పిలిపించినట్లు సమాచారం.
Read Also: జపాన్ లో ప్రభాస్ సందడి.. రాజమౌళి ఏమన్నాడంటే..?
Follow Us On: Pinterest


