కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ బ్యూటీల్లో కృతి సనన్ (Kriti Sanon) ఒకరు. అందమైన ఫిజిక్ ఈ బ్యూటీ సొంతం. పొడుగుకాళ్ల సుందరి కూడా. ఆమె గ్లామర్‌కి యాక్టింగ్ కూడా తోడుకావడంతో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ బ్యూటీ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృతి సనన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. తనతో సమాన ఎత్తున్న హీరోల గురించి మాట్లాడింది.
ఎత్తు తక్కువ ఉన్న హీరోలతో పనిచేయడంతో కష్టంగా ఉంటుందని, షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డానని కృతి సనన్ చెప్పింది. హైట్ తక్కువున్న హీరోలతో పనిచేయడం వల్ల కొన్ని ఇబ్బందులు పడినట్టు నవ్వుతూ చెప్పింది. కేవలం ఇద్దరు హీరోలు మాత్రమే తనకు మ్యాచ్ అవుతారని, ప్రభాస్, అర్జున్ కపూర్ మాత్రమే సెట్ అవుతారని చెప్పింది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కావాలంటే హైట్ కూడా అవసరమేనని ఈ బ్యూటీ చెప్పింది. మూవీ ప్రమోషన్లు, ఈవెంట్లలోనూ ఇబ్బందులు పడినట్లు తెలిపారు.
కృతి తన ఎత్తుకు దగ్గరగా లేదా తక్కువ ఎత్తున్న నటులు వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్, షాహిద్ కపూర్, ధనుష్‌తో కలిసి పనిచేసింది. అయినా కూడా కృతి సనన్ (Kriti Sanon) వారందరితో మంచి కెమిస్ట్రీ పండించింది. ఇటీవల ధనుష్ తో కలిసి నటించిన తేరే ఇష్క్ మే చిత్రంతో కృతి హైట్ చర్చకొచ్చింది. ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ వీరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇండస్ట్రీలో ఎత్తుగా ఉండే హీరోయిన్స్‌కు ఆఫర్లు చాలా తక్కువగా ఉంటాయనే అభిప్రాయం ఉన్నప్పటికీ కృతి సనన్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తోంది.
Read Also: గూగుల్ ఏఐ ప్లస్ వచ్చేసింది
Follow Us On: Instagram


