కలం, వెబ్‌డెస్క్: భారత్‌లో అతిపెద్ద ఏఐ మార్కెట్‌ను సద్వినియోగం చేసుకొనే దిశగా గూగుల్ మరో అడుగు వేసింది. ఈ టెక్ దిగ్గజం ఏఐ ప్లస్ (Google AI Plus) సేవలను ప్రారంభించింది. నెలవారీ సబ్‌స్ర్కిప్షన్ రూ.399గా ప్రకటించింది. కొత్తగా సబ్‌స్ర్కిప్షన్ తీసుకునేవాళ్లు ఆరునెలల పాటు రూ.199కే ఈ సేవలు పొందొచ్చు. దీని ద్వారా అత్యాధునిక ఏఐ సేవల్ని తక్కువ ధరకు, మరింత సులభంగా అందుకోవచ్చని గూగుల్ చెబుతోంది. ఈ ప్లాన్‌ను ఫ్యామిలీ షేరింగ్ ద్వారా ఐదు మంది వాడుకోవచ్చు. ఇందులో అత్యాధునిక మోడల్ జెమినీ3 ప్రో వినియోగించుకోవచ్చు.
గూగుల్ ఏఐ ప్లస్ (Google AI Plus) కు అనుసంధానంగా ఉండే జెమినీ యాప్ ద్వారా కోడింగ్, అనువాదం, రైటింగ్, డ్రాయింగ్, క్రియేటింగ్, సొల్యూషన్స్ వంటివి మరింత వేగంగా, సమర్థంగా పొందవచ్చు. అలాగే చిన్న వీడియోలూ రూపొందించుకోవచ్చు. డాక్యుమెంట్ల విశ్లేషణ, వాటి సారాంశం చెప్పే గూగుల్ ఏఐ రీసెర్చ్ అసిస్టెంట్ నోట్‌బుక్ ఎల్‌ఎం రీసెర్చ్ యాక్సెస్ కూడా ఇందులో భాగంగా ఉంది. ఫొటోలు, డ్రైవ్, జీమెయిల్‌పై కలిపి 200జీబీ క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది.
Read Also: రేవంత్ OU పర్యటన వెనుక వ్యూహం ఏంటీ?
Follow Us On: X(Twitter)


