కార్మికుల సమ్మె.. నిలిచిన విద్యుత్​ ఉత్పత్తి

కలం, వరంగల్ బ్యూరో : ఆర్టిజెన్స్ కార్మికుల సమ్మె ప్రభావంతో కాకతీయ థర్మల్ పవర్​ ప్రాజెక్టు (KTPP)లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ లో కేటీపీపీలో మొదటి దశ 500 మెగావాట్లు, రెండో దశ 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు నడుస్తున్నాయి. ఈ రెండు యూనిట్ల నుంచి 16.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టిజెన్స్ కార్మికులు తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్న క్రమంలో వారం రోజులుగా సమ్మెకు దిగారు. దీంతో ప్రాజెక్ట్ లో బ్రేక్ డౌన్ కావడంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ మేరకు అధికారులు కార్మికులతో చర్చలు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>