Mobile Popup Ad
Mobile Popup Ad

కుటుంబ వివాదం: కోర్టుకెక్కిన ప్రముఖ సినీ నటి

కలం, వెబ్​ డెస్క్​ : ప్రముఖ సినీ నటి హన్సిక మోత్వానీ (Hansika) కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. తన వదిన నాన్సీ జేమ్స్ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఆరోపణలపై హన్సిక తీవ్రంగా స్పందించారు. తనపై, తన కుటుంబంపై నిందలు వేస్తూ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే కారణంతో నాన్సీ జేమ్స్‌పై ఆమె రూ.2 కోట్ల రూపాయల పరువునష్టం దావా వేశారు.

గత కొద్ది రోజులుగా నాన్సీ జేమ్స్ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ, హన్సిక కుటుంబం తనను శారీరకంగా, మానసిక వేదనకు గురిచేస్తోందని, తాను గృహహింసకు గురవుతున్నానని ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను హన్సిక పూర్తిగా ఖండించారు. కేవలం తమ కుటుంబం నుండి డబ్బు వసూలు చేయాలనే దురుద్దేశంతోనే నాన్సీ ఇలాంటి అసత్య ప్రచారాలకు దిగుతున్నారని హన్సిక (Hansika) తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒక సెలబ్రిటీగా సమాజంలో తనకున్న గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న నాన్సీపై చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును కోరారు.

Read Also: ప్ర‌భాస్‌కి ధురంధ‌ర్ సినిమా చూపించిన వంగా.. రీజ‌న్ అదేన‌ట‌!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>