కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తన్న ఇండిగో విమానానికి (Indigo Flight) పెను ప్రమాదం తప్పింది. మంగళవారం శంషాబాద్ నుంచి చండీగడ్ వెళ్లిన ఫ్లైట్ ల్యాండ్ అయిన కొద్దిసేపటికే క్యాబిన్ లో పొగలు వచ్చాయి. ఇది గమనించిన సిబ్బంది ప్రయాణికులను కిందికి దింపారు. ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో (Power Bank Explodes) పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునే లోపే పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఘటన సమయంలో విమానంలో 198 మందితో సహా ఇద్దరు చిన్నారులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
Read Also: ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి : డిప్యూటీ సీఎం భట్టి
Follow Us On : WhatsApp

