కలం, వెబ్ డెస్క్: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) తీవ్ర విమర్శలు చేశారు. కవిత పార్టీ గురించి ఒక్క క్షణం కూడా మాట్లాడనని.. ఆలోచన కూడా చేయనని అన్నారు. కేసీఆర్ పై కవిత విమర్శలు చేయడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. కేసీఆర్ ను తిట్టడం వల్ల ఆమెకే నష్టం జరుగుతుందని చెప్పారు. కవితది అసలు పార్టీనే కాదని.. ఆమె పార్టీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. ఈ దేశంలో ప్రజల కోసం వచ్చిన పార్టీలు నిలబడ్డాయి కానీ.. వ్యక్తుల కోసం వచ్చే పార్టీని నిలబడవు అని పేర్కొన్నారు. ఇంకా పర్మిషన్ రాని పార్టీ గురించి తాము మాట్లాడబోమని అన్నారు. కవిత కేసీఆర్ బిడ్డ కాకుంటే ఎవరైనా పట్టించుకుంటారా? అని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project), విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై సీబీఐ దర్యాప్తు (CBI investigation) కోరేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై జగదీశ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే తాము అసెంబ్లీలోనే ఛాలెంజ్ చేశామన్నారు. ఈ ఎఫ్‌బిఐ, కేజీబీ, సీబీఐ విచారణలకు కేసీఆర్ భయపడేది లేదని స్పష్టం చేశారు. అసలు విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపింది నిజమే అయితే కమిషన్ రిపోర్టు ఇస్తే అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటును కొనసాగించని వెధవలు.. ఈ కాంగ్రెస్ దద్దమ్మలు అంటూ ఆయన (Jagadish Reddy) దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని సరిగా నడపలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విచారణ చేయాలన్నారు.
Read Also: శ్రీరాముడిపై కొండా సురేఖ వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీజేపీ
Follow Us On : WhatsApp

