కలం, వెబ్ డెస్క్: బీహార్ (Bihar) సీఎం నితీశ్ రాజీనామాతో తదుపరి సీఎం ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) సీఎం బాధ్యతలు చేపట్టనున్నారంటూ పుకార్లు ఊపందుకున్నాయి. ఇటీవలే నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లారు. ఈ రోజు నితీశ్ రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం బీహార్ సీఎంను అధికారికంగా ప్రకటించనున్నారు. పాట్నాలోని బీజేపీ కార్యాలయం బయట సామ్రాట్ చౌదరి బీహార్ సీఎం కానున్నారంటూ ఫ్లెక్లీలు ఏర్పాటయ్యాయి. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారన్నది తమకు తెలియదని బీజేపీ నాయకులు చెప్తున్నారు. తదుపరి సీఎం ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందని అంటున్నారు. బీజేపీ కార్యకర్తలు సదరు ఫ్లెక్సీలను తొలగించారు. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేయించారన్నది తెలియరాలేదు. ఏదేమైనా ఈ రోజు సాయంత్రంలోపు బీహార్ సీఎం ఎవరన్న దానిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

