తెలంగాణ రాజ‌కీయాల‌పై న‌టి పూన‌మ్ కౌర్ సంచ‌ల‌న పోస్ట్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ టాపిక్స్‌పై త‌ర‌చూ స్పందించే న‌టి పూన‌మ్ కౌర్ (Poonam Kaur) తాజాగా తెలంగాణ రాజ‌కీయాల‌పై చేసిన ఓ సోష‌ల్ మీడియా పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఇటీవ‌ల కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కొడుకు బండి భ‌గీర‌థ్ (Bandi Bhagirath) పోక్సో కేసులో ఇరుక్కున్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించి సిట్ విచార‌ణ‌, కోర్టు కేసులు అంటూ హ‌డావిడి జ‌రుగుతున్న త‌రుణంలో పూన‌మ్ కౌర్ ఎక్స్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్ట్ చేశారు. “వసుధైవ కుటుంబాన్ని ప్రతిబింబించే టీమ్‌కి వందనం.. తెలంగాణ కోసం చేసిన త్యాగాలు తెలిసిన వాళ్లు.. వాళ్ల కోసం కాకుండా ప్రజల కోసం భవిష్యత్తుని నిర్మిస్తున్న వాళ్లు.. జై తెలంగాణ. జై హింద్..” అని త‌న పోస్టులో పేర్కొన్నారు.

పూన‌మ్ కౌర్ (Poonam Kaur) త‌న పోస్టుకు ఒక ఆస‌క్తిక‌ర ఫోటోను కూడా జోడించ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, క‌ల్వ‌కుంట్ల క‌విత‌, బండి సంజ‌య్‌, అస‌దుద్దీన్ ఓవైసీ… వీరంతా క‌లిసి న‌వ్వుతూ ఉన్న ఒక ఫోటోను ఆమె షేర్ చేశారు. రాష్ట్రంలో పార్టీల ప‌రంగా ఎంత‌టి రాజ‌కీయ వైరుధ్యాలున్నా, వివాదాలు న‌డిచినా, తెర వెనుక ఈ రాజ‌కీయ నాయ‌కులంతా ఒక్క‌టేన‌ని, వారికి స‌త్సంబంధాలు ఉంటాయ‌ని ఆమె ఈ పోస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుత తెలంగాణ‌ రాజ‌కీయాల‌పై పూన‌మ్ కౌర్ వ్యంగ్యంగా ఇలా పోస్ట్ పెట్ట‌డంతో నెటిజ‌న్లు దానికి ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు.

 Read Also: నల్లగొండ గులాబీ కోటలో హరీశ్ సీక్రెట్ ఆపరేషన్..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>